Let everything that has breath praise the LORD. Psalms 150:6

Friday, September 3, 2010

ఉద్దేశ్యముతో కూడిన ప్రయాణము
(ఈ పుస్తకము నుండి ఎక్కువ ప్రయోజనము పొందుట ఎట్లు ?)
ఇది పుస్తకము మాత్రమే కాదు. దేనికొరకు నేను ఈ భూమిపై ఉన్నాను అన్నటువంటి జీవితములో అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నకు జవాబును కనుగొనుటకు నిన్ను పురికొల్పు 40- రోజుల ప్రయాణమునకు మార్గదర్శి. ఈ ప్రయాణము చివరికి, నీ జీవితము కొరకైన దేవుని ఉదేశ్యమును నీవు తెలిసికొందువు. మరియు నీ జీవితములోని చిన్న చిన్న భాగాలన్నియు ఎలా యిమిడి ఉన్నాయో తెలిసికొందువు.
జీవితముపై ఇటువంటి దృష్టిని కలిగి ఉండుట నీ ఒతిడి ని తగ్గిస్తుంది, నీ నిర్ణయాలను సులువు చేస్తుంది, నీ సంతృప్తిని పెంచుతుంది, అత్యంత ప్రాముఖ్యంగా నిత్యత్వము కొరకై నిన్నుసిద్దపరుస్తుంది.
నీ ముందున్న 40 దినములు
ఈ రోజుల్లో సగటు మనవ జీవిత కాలము 25,550 రోజులు. నీవు సాధారణమైన వ్యక్తివి అయితే నీవు జీవించే దినములు ఇన్ని. మిగిలిన దినములలో నీవేమి చేయవలెనని దేవుడు కోరుచున్నాడోదానిని కనుగొనుటకు వాటిలో
40 దినములు
ఏర్పరచుకొనుట తెలివైన పని కాదా?

40 దినముల సమయాన్ని దేవుడు ప్రాముఖ్యమైనదిగా పరిగణిస్తాడని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తున్నది. దేవుడు ఎవరినైనా తన ఉద్దేశ్యముల కొరకు సిద్ధపరచుటకు ఆయన 40 దినములు ఉపయోగించాడు.
40 దినముల వర్షం నోవహు జీవితమును మార్చివేసింది.
40 దినములు సీనాయి కొండ పై ఉండుట మోషే జీవితమును మార్చివేసింది.
40 దినములు వాగ్ధాన దేశములో ఉండుట వేగులవారి జీవితమును మార్చివేసింది.
40 గోల్యాతు సవాలు దావీదు జీవితాన్ని మార్చివేసింది.
40 దినములకు సరిపడా బలాన్ని దేవుడు ఒక్క పూట భోజనముతో ఇవ్వడం ద్వారా ఎలియా జీవితం మార్చబడింది.
40 దినముల అవకాశం దేవుడు ఇవ్వడం వలన నీనెవె పట్టణమంతయు మార్చబడింది.
40 దినములు అరణ్యములొ ఉండుట వలన యేసు ప్రభువు శక్తిని పొందారు.యేసు ప్రభువు పునరుథానుడై లేచిన తరువాత 40 దినములు ఆయనతో ఉందుట శిష్యుల జీవితాల్ని మర్చివేసింది.
నీ ముదున్న 40 రొజులు నీ జీవితాన్ని మార్చివేస్తాయి.
ఈ పుస్తకం 40 చిన్న అధ్యాయాలుగా విభజించబడింది. రోజుకు ఒక్క అధ్యాయం మాత్రమే చదువవలెనని నేను మిమ్మును గట్టిగా కోరుచున్నాను. దాని వలన మీ జీవితానికి అన్వయించుకొని అలొచించుటకు మీకు కావలసినంత సమయం దొరుకుతుంది. "మీ అలోచనా విధానమును మార్చుట వలన దేవుడు మిమ్మును ఒక నూతనమైన వ్యక్తిగా మారుస్తాడు. అప్పుడు దేవుడు మిమ్మును ఏమి చేయమంటున్నడో మీరు తెలిసికొనగలరు."






Dedication

ఉద్దేశ్యముతో నడిపించబడు జీవితము
(రచయిత: రిక్ వారెన్)

ఈ పుస్తకము నీకే అంకితము చేయబడినది.
నీవు పుట్టకమునుపే దేవుడు నీ జీవితములో ఈ సందర్భమును ఏర్పాటుచేసి యున్నాడు.
ఈ పుస్తకమును నీవు కలిగి ఉండుట ప్రమాదవశాత్తు (అనుకోకుండా) జరిగినది కాదు. ఈ భూమిపై మరియు ఎన్నటెన్నటికీ నిత్యత్వములో నీవు జీవించుటకు దేవుడు ఏర్పరచిన జీవితమును నీవు తెలిసికోవాలని దేవుని ప్రగాఢమైన కోరిక.
మనమెవరమో, మనము దేనికోసం జీవిస్తున్నామో అది క్రీస్తులో మాత్రమే కనుగొనగలము. మనము క్రీస్తును గూర్చి మొదటి సారి వినుటకు చాలా కాలము పూర్వమే ... అయన దృష్టి మనపై ఉంది, మహిమతో కూడిన జీవితము కొరకైన ప్రణాలిక ఆయన కలిగి ఉన్నాడు, తన సంపూర్ణమయిన ఉద్దేశ్యములో కొంత భాగాన్ని ఆయన ప్రతి విషయములో, ప్రతి ఒక్కరిలో జరిగిస్తున్నాడు. (ఎఫెసీయులకు 1:11)
నా జీవితాన్ని ఈ స్తితికి తెచ్చి నాకు ఈ సత్యాలను నేర్పిన పూర్వకాలపు మరియు సమకాలీన వందల కొలది రచయితలకు మరియు బోధకులకు నేను కృతజ్ఞుడను. వీటిని మీతో ఏర్పాటు నాకు లభించిన ధన్యతకై దేవునికి, మీకు వందనస్తుడను.