ఉద్దేశ్యముతో నడిపించబడు జీవితము
(రచయిత: రిక్ వారెన్)
ఈ పుస్తకము నీకే అంకితము చేయబడినది.
నీవు పుట్టకమునుపే దేవుడు నీ జీవితములో ఈ సందర్భమును ఏర్పాటుచేసి యున్నాడు.
ఈ పుస్తకమును నీవు కలిగి ఉండుట ప్రమాదవశాత్తు (అనుకోకుండా) జరిగినది కాదు. ఈ భూమిపై మరియు ఎన్నటెన్నటికీ నిత్యత్వములో నీవు జీవించుటకు దేవుడు ఏర్పరచిన జీవితమును నీవు తెలిసికోవాలని దేవుని ప్రగాఢమైన కోరిక.
మనమెవరమో, మనము దేనికోసం జీవిస్తున్నామో అది క్రీస్తులో మాత్రమే కనుగొనగలము. మనము క్రీస్తును గూర్చి మొదటి సారి వినుటకు చాలా కాలము పూర్వమే ... అయన దృష్టి మనపై ఉంది, మహిమతో కూడిన జీవితము కొరకైన ప్రణాలిక ఆయన కలిగి ఉన్నాడు, తన సంపూర్ణమయిన ఉద్దేశ్యములో కొంత భాగాన్ని ఆయన ప్రతి విషయములో, ప్రతి ఒక్కరిలో జరిగిస్తున్నాడు. (ఎఫెసీయులకు 1:11)
నా జీవితాన్ని ఈ స్తితికి తెచ్చి నాకు ఈ సత్యాలను నేర్పిన పూర్వకాలపు మరియు సమకాలీన వందల కొలది రచయితలకు మరియు బోధకులకు నేను కృతజ్ఞుడను. వీటిని మీతో ఏర్పాటు నాకు లభించిన ధన్యతకై దేవునికి, మీకు వందనస్తుడను.
Friday, September 3, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment